నెలసరి సరిగా ఉన్నా pregnancy ఎందుకు రావడం లేదు? కారణాలు మరియు పరిష్కారాలు.
సాధారణంగా నెలసరి (Periods) ప్రతి 28 నుండి 30 రోజులకు ఒకసారి క్రమంగా వస్తుంటే, ఆ మహిళ ఆరోగ్యంగా ఉందని మరియు గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉందని భావిస్తారు. కానీ, కేవలం పీరియడ్స్ రావడం మాత్రమే గర్భధారణకు సరిపోదు. వైద్య పరిభాషలో దీనిని ‘Unexplained Infertility’ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు.
నెలసరి క్రమంగా ఉన్నా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల ప్రధాన కారణాలను లోతుగా పరిశీలిద్దాం:
1. అండం విడుదల కాని నెలసరి (Anovulatory Cycles)
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ప్రతి నెలా బ్లీడింగ్ అయినంత మాత్రాన అండం విడుదలైనట్టు కాదు. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల కాకపోయినా పీరియడ్స్ వస్తాయి.
- ఎందుకు జరుగుతుంది?: అధిక ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్ (PCOS) ప్రారంభ దశలు లేదా ప్రోలాక్టిన్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల ఇలా జరుగుతుంది.
- గుర్తించడం ఎలా?: ఫోలిక్యులర్ స్టడీ (Follicular Study) అనే చిన్న స్కాన్ ద్వారా అండం పెరుగుతుందా లేదా విడుదలవుతుందా అనేది తెలుసుకోవచ్చు.
2. అండాల నిల్వ మరియు నాణ్యత (Low AMH & Egg Quality)
మహిళలు పుట్టినప్పుడే ఒక నిర్ణీత సంఖ్యలో అండాలతో పుడతారు. వయసు పెరిగే కొద్దీ ఈ సంఖ్య తగ్గుతుంది.
- AMH ప్రాముఖ్యత: యాంటీ ములేరియన్ హార్మోన్ (AMH) పరీక్ష ద్వారా మీ అండకోశంలో ఎన్ని అండాలు ఉన్నాయో తెలుస్తుంది. పీరియడ్స్ బాగున్నా, AMH తక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుంది.
- నాణ్యత: అండాల సంఖ్య బాగున్నా, వాటి నాణ్యత సరిగ్గా లేకపోతే ఫలదీకరణ (Fertilization) జరగదు.
3. ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులు (Tubal Factors)
అండం మరియు వీర్యకణం కలిసే ప్రదేశం ఫెలోపియన్ ట్యూబ్. పీరియడ్స్ సాధారణంగా ఉన్నా, ఒకవేళ ఈ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే గర్భం రాదు.
కారణాలు: గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్లు (PID), అపెండిసైటిస్ సర్జరీలు లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్ దెబ్బతినవచ్చు.
పరీక్ష: HSG (Hysterosalpingogram) అనే ఎక్స్-రే పరీక్ష ద్వారా ట్యూబ్స్ తెరిచి ఉన్నాయో లేదో చూడవచ్చు.
4. పురుషుల సంతానలేమి (Male Infertility)
చాలా సందర్భాల్లో దంపతులు భార్యకు మాత్రమే పరీక్షలు చేయిస్తారు. కానీ సంతానలేమి సమస్యల్లో 40% నుంచి 50% వరకు పురుషులలోనే ఉంటున్నాయి.
- వీర్యకణాల సమస్య: సంఖ్య (Count) బాగున్నా, వాటి కదలిక (Motility) లేదా ఆకృతి (Morphology) సరిగ్గా లేకపోతే అండాన్ని చేరుకోలేవు.
- పరిష్కారం: ఒక సాధారణ సెమెన్ అనాలిసిస్ పరీక్ష ద్వారా దీనిని నిర్ధారించవచ్చు.
5. గర్భాశయ పొర :
గర్భాశయం లోపలి పొర (Endometrium) గర్భాన్ని మోయడానికి సిద్ధంగా ఉండాలి.
ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్: అండం, వీర్యకణం కలిసినా.. అది వెళ్లి గర్భాశయ గోడకు అంటుకోకపోతే ప్రెగ్నెన్సీ రాదు.
6. ఎండోమెట్రియోసిస్:
గర్భాశయ lining కణజాలం బయట పెరగడం వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి రావచ్చు మరియు ఇది సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.
HORIZON WOMEN & FERTILITY నుంచి ఒక మాట: pregnancy- ఒక ప్రాసెస్
“నాకు అన్నీ సక్రమంగా ఉన్నా గర్భం ఎందుకు రావడం లేదు?” అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంటే, గుర్తుంచుకోండి—మీరు ఒంటరి వారు కాదు.
ట్రీట్మెంట్ లో ముందుకు వెళ్లడం అంటే ఒక్కసారిగా చేసే పెద్ద జంప్ కాదు. అది చిన్న చిన్న అడుగుల ప్రయాణం:
- సరైన అవగాహన: సమస్య ఎక్కడ ఉందో క్లియర్ గైడెన్స్‌తో తెలుసుకోవడం.
- నిపుణుల తోడ్పాటు: డాక్టర్ లావణ్య బొమ్మకంటి గారి వంటి నిపుణుల పర్యవేక్షణలో పర్సనలైజ్డ్ చికిత్స.
- భావోద్వేగ సపోర్ట్: చికిత్స తీసుకునే సమయంలో దంపతులు ఒకరికొకరు తోడుగా ఉండటం.
- ట్రీట్మెంట్ ఆప్షన్స్ : అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి
ఓవ్యూలేషన్ ఇండక్షన్
- IUI
- IVF
- ICSI
ఫెర్టిలిటీ సంతానోత్పత్తిని పెంచే ల్యాపరోస్కోపిక్ సర్జరీలు