అధిక బరువు మరియు ప్రెగ్నెన్సీ: బరువు తగ్గితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయా?
ఈ రోజుల్లో అధిక బరువు (Obesity) చాలా మంది మహిళల్లో కనిపిస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న కపుల్స్‌లో ఒక సాధారణ ప్రశ్న ఉంటుంది.
బరువు తగ్గితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు నిజంగా పెరుగుతాయా? అధిక బరువు శరీరంలోని హార్మోన్ బ్యాలెన్స్ ను ఎఫెక్ట్ చేసి ఫెర్టిలిటీ (fertility) పై ప్రభావం చూపవచ్చు
అధిక బరువు ప్రెగ్నెన్సీపై ఎలా
ప్రభావం చూపుతుంది?
అధిక బరువు ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్ల బ్యాలెన్స్ మారిపోవచ్చు. ఈ మార్పులు ఎగ్స్ పెరుగుదల మరియు విడుదల ప్రక్రియపై ప్రభావం చూపుతాయి.
దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు:
- ఒవ్యూలేషన్ (Ovulation) సరిగా జరగకపోవచ్చు
• పీరియడ్స్ సైకిల్ ఇర్ రెగ్యులర్ అవ్వచ్చు
• హార్మోన్ల imbalance ఏర్పడవచ్చు
• ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు తగ్గవచ్చు
కొన్ని సందర్భాల్లో అధిక బరువు కారణంగా శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపవచ్చు.
PCOS సమస్యలో అధిక
బరువు పాత్ర
అధిక బరువు ఉన్న మహిళల్లో PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
PCOS ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్ బ్యాలెన్స్ మారిపోవడం వల్ల ఎగ్స్ ఇం ప్రూవ్మెంట్ మరియు విడుదల ప్రక్రియ ఇంపాక్ట్ అవుతుంది.
- ఎగ్స్ సరిగ్గా విడుదల కావు
• పీరియడ్స్ సైకిల్ ఇర్ రెగ్యులర్ గా ఉంటుంది
• ఒవ్యూలేషన్ క్రమంగా జరగకపోవచ్చు
• ప్రెగ్నెన్సీ ఆలస్యం కావచ్చు
కొన్ని సందర్భాల్లో బరువు తగ్గడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యి PCOS లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు.
ఎగ్స్ నాణ్యతపై ప్రభావం
అధిక బరువు ఎగ్స్ క్వాలిటీపై కూడా ప్రభావం చూపవచ్చు. హార్మోన్లలో వచ్చే మార్పులు ఎగ్స్ అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు.
దీని వల్ల:
- ఎగ్ మరియు స్పెర్మ్ కలిసే అవకాశం తగ్గవచ్చు
• ఫెర్టిలైజేషన్ జరగడం కష్టమవుతుంది
• Embryo అభివృద్ధి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది
ఈ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు
అధిక బరువు ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అవి:
- గెస్టేషనల్ డయాబెటిస్
• బ్లడ్ ప్రెషర్ సమస్యలు
• మిస్క్యారేజ్ ప్రమాదం
• సిజేరియన్ డెలివరీ అవకాశాలు పెరగడం
అందువల్ల ప్రెగ్నెన్సీకి ముందు ఆరోగ్యకరమైన బరువును సాధించడం చాలా మంచిది.
బరువు తగ్గితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయా?
మెడికల్ స్టడీస్ ప్రకారం మొత్తం శరీర బరువులో 5% నుంచి 10% వరకు తగ్గినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.
బరువు తగ్గడం వల్ల:
- హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది
• ఒవ్యూలేషన్ సక్రమంగా జరుగుతుంది
• పీరియడ్స్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది
• ఫెర్టిలిటీ మెరుగుపడుతుంది
• ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి
అంటే చిన్న హెల్తీ లైఫ్‌స్టైల్ మార్పులు కూడా మంచి ఫలితాలు ఇవ్వవచ్చు.
Horizon Women & Fertility
నుంచి ఒక సూచన
ప్రెగ్నెన్సీ ప్రతి కపుల్ జీవితంలో ఒక ఆశతో నిండిన ప్రయాణం. కొన్నిసార్లు అధిక బరువు వంటి ఆరోగ్య కారణాలు ఈ ప్రయాణాన్ని కొంత ఆలస్యం చేయవచ్చు.
అలాంటి సమయంలో డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరైన అవగాహన మరియు సమయానికి తీసుకునే వైద్య సలహాతో చాలా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.
Horizon Women & Fertility లో మా స్పెషలిస్ట్స్ ప్రతి కపుల్ యొక్క హెల్త్ కండిషన్‌ని పూర్తిగా అర్థం చేసుకుని, సరైన గైడెన్స్ అందిస్తూ మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో నమ్మకమైన సపోర్టివ్ గా ఉంటారు.
ముగింపు
అధిక బరువు ప్రెగ్నెంట్ అవ్వడంపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన కారణం కావచ్చు.
అయితే హెల్తీ లైఫ్‌స్టైల్, బ్యాలెన్స్ డైట్ మరియు బాడీ వెయిట్ పై శ్రద్ధ పెట్టడం ద్వారా ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
మీరు చాలా కాలంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతే, ఆలస్యం చేయకుండా ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం మంచిది.