PCOS పేరు ఇప్పుడు PMOS అయింది — ఈ ఒక్క అక్షరం మార్పు మీకు ఎందుకు ముఖ్యమైనది?
డా. లావణ్య బొమ్మకంటి, MBBS MS(OBG) MRCOG(UK) FRM — Consultant Fertility Specialist & Gynaecologist, Horizon Women & Fertility, బంజారా హిల్స్, హైదరాబాద్
May 2026లో The Lancet అనే అంతర్జాతీయ వైద్య journalలో ఒక landmark paper వచ్చింది. దాని ప్రకారం, Polycystic Ovary Syndrome (PCOS) పేరు ఇప్పటి నుండి Polyendocrine Metabolic Ovarian Syndrome (PMOS) గా మారింది. ప్రపంచంలో అతి పెద్ద fertility మరియు women’s health సంస్థలైన ASRM మరియు ESHRE రెండూ ఈ మార్పును అంగీకరించాయి.
Acronymలో ఒక్క అక్షరం మాత్రమే మారింది — ‘C’ బదులు ‘M’. కానీ ఈ మార్పు వెనక కారణాలు, మీ diagnosis కి, మీ treatment కి, మీ భవిష్యత్తు health కి ఏమి మార్పు ఉంటుందో — అది చాలా ముఖ్యమైనది.
మేము 15 సంవత్సరాలకు పైగా PCOS/PMOS ని manage చేస్తున్నా ము. Clinic లో అన్నిటికన్నా common గా చూసే condition ఇదే — అదే సమయంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడే condition కూడా ఇదే. అందుకే ఈ పేరు మార్పు గురించి తెలుసుకోవడం women అందరికీ ముఖ్యం.
“PCOS” పేరులో సమస్య ఏమిటి?
PCOS అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతారు — “polycystic” అనే పదమే ఆ confusion కి కారణం. ఆ పేరు వింటే ovaries మీద cysts ఉన్నాయని అనిపిస్తుంది. కానీ అవి నిజంగా pathological cysts కాదు. అవి చిన్న follicles — పూర్తిగా develop కాని eggs — ultrasound లో ఒక specific pattern లో కనిపిస్తాయి. వాటిని “cysts” అని పిలవడం మొదటి నుండీ misleading. దీని వల్ల రెండు problems వచ్చాయి.
మొదటిది — ultrasound లో ఆ pattern కనపడని women కి “scan normal గా ఉంది, మీకు PCOS లేదు” అని చెప్పేవారు.
రెండవది — “PCOS” పేరు వల్ల అందరి దృష్టీ ovaries మీద పడింది. బేసిక్ గా ఉన్న hormonal మరియు metabolic disturbances — అసలు address కాకుండా పోయాయి.
The Lancet లో PCOS పేరు గురించి ఇలా రాశారు: “ఇది inaccurate, ఇది cysts ఉన్నాయని suggest చేస్తుంది, నిజమైన endocrine మరియు metabolic features ని ఓవర్ లుక్ చేస్తుంది, diagnosis delay కి, fragmented care కి, stigma కి దారి తీస్తుంది.”
PMOS అంటే ఏమిటి? కొత్త పేరు ఏమి చెప్తుంది?
కొత్త పేరులో ప్రతి పదం ఒక కారణంతో ఉంది:
Poly-endocrine — అంటే అనేక hormonal systems involved అవుతాయి. Ovaries మాత్రమే కాదు. Insulin, androgens (testosterone లాంటి male hormones), LH, FSH — ఇవన్నీ, brain నుండి వచ్చే signals కూడా affect అవుతాయి. Insulin resistance మరియు hyperinsulinemia — ఇవే ఈ condition యొక్క core features అని ప్రపంచవ్యాప్తంగా patients మరియు doctors ఇప్పుడు గుర్తిస్తున్నారు.
Metabolic — ఇది అతి ముఖ్యమైన పదం. PMOS ఉన్న women లో insulin resistance చాలా common — సన్నగా ఉన్నవారికి కూడా. దీని వల్ల type 2 diabetes, gestational diabetes, high blood pressure, cholesterol problems, మరియు heart disease risk పెరుగుతాయి.
Ovarian — Ovaries ఇంకా part of the picture. Ovulation, menstrual cycle regularity, మరియు androgen production లో ovaries కీలక పాత్ర పోషిస్తాయి. పేరు మారినా ovarian involvement పోలేదు — దాన్ని మాత్రమే focus చేయడం ఆగింది.
Syndrome — ఇది ఒక syndrome గానే ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే ఇది woman నుండి woman కి చాలా differently కనిపిస్తుంది. ఏ ఇద్దరి PMOS కేసులూ exactly alike ఉండవు.
Periods రావడం లేదు — PMOS తో ఇది ఎందుకు జరుగుతుంది?
Periods రావడం లేదు. లేదా చాలా irregular గా వస్తున్నాయి అని gynecologist దగ్గరికి వచ్చే women చాలా మంది ఉంటారు. PMOS లో periods రావడం లేదు అంటే కారణం ఏమిటంటే — ovulation trigger చేసే hormonal signalling disturb అవుతుంది. Regular ovulation లేకుండా, uterus lining build up అవుతుంది కానీ సరైన సమయానికి shed కాదు.
పేరు మారినా irregular cycles యొక్క diagnostic criteria మారలేదు. ఎందుకు irregular గా ఉన్నాయో అని ఆలోచించే విధానం మారింది. Insulin resistance అనేది root cause అయినప్పుడు, insulin resistance ని treat చేయడం periods manage చేయడంతో సమానంగా ముఖ్యం. Metformin, inositol, మరియు lifestyle changes వల్ల చాలా మంది women కి regular cycles వస్తాయి.
PCOS తో Pregnancy సాధ్యమా? PMOS తో Fertility ఏమవుతుంది?
PCOS తో pregnant అవుతారా అని చాలా మంది women భయపడతారు. PMOS-related infertility చాలా treatable.
PMOS 8 మంది women లో 1 కి వస్తుంది — ప్రపంచవ్యాప్తంగా 170 million కంటే ఎక్కువ మందికి. నా clinic లో infertility కి అత్యంత common కారణం irregular లేదా absent ovulation — మరియు ఇది సరిగ్గా manage చేస్తే pregnancy చాలా సాధ్యం.
PMOS framework తో treatment ఇప్పుడు more డీటెయిల్ గా ఉంటుంది. Ovulation induction లేదా IVF కి jump అవ్వడానికి ముందు metabolic picture చూస్తాం. Insulin resistance ఉందా? AMH ఎంత? Weight history ఏమిటి? Insulin sensitivity కొంచెం improve చేసినా — metformin, exercise, లేదా diet changes వల్ల — నెలల తరబడి periods రావడం లేదు అన్న women కి spontaneous ovulation వస్తుంది. Medication కన్నా body తనే modulate చేసుకున్నప్పుడు outcomes బాగుంటాయి.
Ovulation induction అవసరమైనప్పుడు, letrozole ఇప్పుడు first-line choice. IUI మరియు IVF కూడా available — కానీ PMOS ovaries stimulation కి sensitive గా ఉంటాయి. అందుకు experience ఉన్న doctor దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.
PCOS Weight Gain, Acne, మరియు Skin Problems — ఇవి ఎందుకు వస్తాయి?
చాలా సార్లు young women periods గురించి కాదు, skin ప్రాబ్లమ్స్ గురించి వస్తారు. PCOS weight gain మరియు skin changes ఈ condition యొక్క చాలా visible signs.
Acne: PMOS లో elevated androgens వల్ల acne వస్తుంది — ముఖ్యంగా jawline, chin, మరియు neck మీద. PCOS acne treatment అంటే సాధారణ face wash లేదా cream పని చేయదు — ఎందుకంటే ఇది skin problem కాదు, hormonal problem. Root cause అయిన androgen excess ని address చేయాలి.
Hair: Excess facial లేదా body hair (hirsutism) మరియు scalp hair తక్కువ అవడం కూడా వస్తుంది. ఇవి చాలా frustrating, visible symptoms — confidence ని affect చేస్తాయి. వీటిని cosmetic గా dismiss చేస్తారు. కానీ ఇవి hormonal signals.
PCOS Weight Gain: Insulin resistance వల్ల weight gain వస్తుంది — ముఖ్యంగా abdomen చుట్టూ. Diet సరిగ్గా ఉన్నా weight తగ్గడం కష్టంగా అనిపిస్తుంది. ఇది willpower problem కాదు — metabolic problem. Insulin resistance treat చేస్తే weight management సులభం అవుతుంది.
Acanthosis Nigricans: Neck, underarms, inner thighs చుట్టూ వచ్చే dark, velvety skin patches — ఇవి insulin resistance యొక్క direct marker. ఈ patches ఉన్నాయి మరియు irregular periods కూడా ఉన్నాయంటే — ఇది PMOS కి strong clinical signal. అంటే metabolic component address చేయాలి — period లేదా skin symptom మాత్రమే కాదు.
Insulin resistance ని treat చేసినప్పుడు — acne, weight gain, irregular periods, మరియు fertility problems అన్నీ same root cause కి converge అవుతాయి. Root cause fix చేస్తే ఈ చాలా downstream problems కలిసే improve అవుతాయి.
Long-term Health విషయంలో ఏమి జరుగుతుంది?
PMOS ఉన్న women కి type 2 diabetes, pregnancy లో gestational diabetes, high blood pressure, elevated cholesterol, మరియు cardiovascular disease యొక్క lifetime risk ఎక్కువ. మీ care ఇప్పటి వరకు periods లేదా fertility మీద focus అయి ఉంటే — PMOS rename ఒక reminder: metabolic మరియు cardiovascular dimensions కూడా monitor చేయించుకోండి. Blood glucose, blood pressure, lipids — ఇవన్నీ hormonal picture తో పాటు regularly check చేయాలి.
మీ Diagnosis మారుతుందా? Treatment మారుతుందా?
PCOS diagnosis వచ్చినవారికి — మీ diagnosis మారదు. Condition same గా ఉంది. Rotterdam criteria — irregular cycles, elevated androgens, మరియు ultrasound లో polycystic ovarian morphology — ఇవే diagnosis basis గా ఉంటాయి. New tests లేదా new workup అవసరం లేదు.
మారేది మీ care చుట్టూ ఉన్న framework. PMOS diagnosis ఇప్పుడు complete evaluation కి prompt చేయాలి. Metabolic screening కూడా. ఇది long-term care plan కి దారి తీయాలి. మరియు దశాబ్దాలుగా ఈ condition కి attach అయిన stigma తొలగించడానికి సహాయపడాలి — PMOS అంటే weight problem, లేదా తన వల్లే వచ్చిందని అనే తప్పుడు అభిప్రాయం పోవాలి.
Horizon women and fertility లో PMOS మేనేజ్మెంట్
Horizon Women & Fertility లో మా approach ఎప్పుడూ whole picture చూసేది — hormonal workup, insulin మరియు metabolic markers, AMH, thyroid, మరియు detailed menstrual మరియు lifestyle history. PMOS rename మా approach ని confirm చేసింది. ఒక్క pill లేదా injection కంటే multiple dimensions ఉన్న treatment plan ఎందుకు అవసరమో patients కి explain చేయడానికి better language ఇచ్చింది.
హైదరాబాద్ లో PCOS specialist కోసం వెతుకుతున్నా, Telangana లో PMOS treatment కోసం అడుగుతున్నా, మీ irregular periods అర్థం చేసుకోవాలనుకున్నా, skincare పని చేయని acne తో struggle అవుతున్నా, లేదా PCOS తో pregnant అవుతానా అని wonder అవుతున్నా — SOLUTION దాదాపు ఎప్పుడూ YES — సరైన evaluation మరియు సరైన plan తో.
Horizon Women & Fertility | Plot 723, Road No. 1, Banjara Hills, Hyderabad 500034 | +91 80194 25500 | horizonwomenandfertility.com | Mon–Sat ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
PCOS అంటే ఏమిటి | PMOS అంటే ఏమిటి | హైదరాబాద్ లో PCOS specialist | PCOS తో pregnant అవుతారా | periods రావడం లేదు కారణాలు | irregular periods doctor హైదరాబాద్ | PCOS acne treatment తెలుగు | PCOS weight gain తెలుగు | బంజారా హిల్స్ fertility clinic | PCOS insulin resistance తెలుగు | acanthosis nigricans PCOS తెలుగు | PCOS నుండి pregnancy సాధ్యమా | హైదరాబాద్ లో PMOS treatment | Telangana fertility specialist | PCOS skin problems తెలుగు