ఓజెంపిక్ (Ozempic)& ప్రెగ్నెన్సీ:
PCOS ఉన్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఇటీవల క్లినిక్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న — “ఓజెంపిక్ వాడితే ప్రెగ్నెన్సీ వస్తుందా?”
సోషల్ మీడియాలో “Ozempic Babies” అనే టర్మ్ కూడా ట్రెండ్ అవుతోంది. కానీ దీనికి వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? నిజంగా ఇది ఫెర్టిలిటీని పెంచుతుందా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
PCOS అంటే ఏమిటి? ఎందుకు ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది?
PCOS (Polycystic Ovary Syndrome) అనేది కేవలం పీరియడ్స్ సమస్య కాదు — ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్.
ముఖ్య కారణాలు:
- ఇన్సులిన్ రెసిస్టెన్స్ – శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోదు
- హార్మోన్ అసమతుల్యత – టెస్టోస్టెరాన్ పెరిగి అండం విడుదల జరగదు
- బరువు పెరగడం – ఇది సమస్యను మరింత పెంచుతుంది
👉 ఈ కారణాల వల్లనే ప్రెగ్నెన్సీ దాల్చడం కష్టమవుతుంది.
ఓజెంపిక్ (Ozempic) అంటే ఏమిటి?
Ozempic (Semaglutide) ఒక GLP-1 Receptor Agonist మందు.
ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆకలిని తగ్గిస్తుంది
- తక్కువ తినేలా చేస్తుంది
- బరువు తగ్గిస్తుంది
- ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది
👉 మొదట ఇది డయాబెటిస్ కోసం వాడినా, ఇప్పుడు బరువు తగ్గడానికి విస్తృతంగా వాడుతున్నారు.
ఇది ఫెర్టిలిటీని ఎలా ప్రభావితం చేస్తుంది?
అధిక బరువు ఎగ్స్ క్వాలిటీపై కూడా ప్రభావం చూపవచ్చు. హార్మోన్లలో వచ్చే మార్పులు ఎగ్స్ అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు.
దీని వల్ల:
- ఎగ్ మరియు స్పెర్మ్ కలిసే అవకాశం తగ్గవచ్చు
• ఫెర్టిలైజేషన్ జరగడం కష్టమవుతుంది
• Embryo అభివృద్ధి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది
ఈ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది.
Ozempic Baby” – నిజం ఏమిటి?
అవును, ఈ మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు.
కానీ చాలా ముఖ్యమైన విషయం:
❗ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మందులు సురక్షితం కావు
❗ గర్భం వచ్చిన వెంటనే మందు ఆపాలి
👉 జంతువులపై చేసిన పరీక్షల్లో పిండంపై ప్రతికూల ప్రభావాలు కనిపించాయి
ఫెర్టిలిటీ చికిత్సలో ఎలా వాడతారు?
ఫెర్టిలిటీ స్పెషలిస్టులు ఈ మందులను ప్లాన్ ప్రకారం వాడతారు:
- అధిక బరువు ఉన్న PCOS పేషెంట్స్‌కు
- కొన్ని నెలలు బరువు తగ్గించేందుకు
- తరువాత ప్రెగ్నెన్సీ ప్రయత్నానికి ముందు మందు ఆపేస్తారు (Washout Period)
ముఖ్య హెచ్చరిక
ఓజెంపిక్ వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు.
కానీ:
❗ గర్భధారణ సమయంలో ఈ మందు సురక్షితం కాదు
❗ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఆపాలి
👉 కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ కోసం తీసుకునే మందు కాదు.